KNR: రానున్న పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఎన్నికల వ్యూహంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.