TG: తెలంగాణకు 299 TMCలు చాలు అని రాసిచ్చిన ఘనత BRSకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు APకి 512 TMCలు ఇవ్వడానికి BRS అంగీకరించిందని తెలిపారు. BRS హయాంలో ఇరిగేషన్‌పై రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కానీ ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయారని వ్యాఖ్యానించారు.