KMM: దేశంలో మహిళా విద్యా వికాసానికి అహర్నిశలు కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అనంతనగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలత పిలుపునిచ్చారు. శనివారం పాఠశాలలో ఆమె జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి చరిత్ర సృష్టించారని కొనియాడారు.