గరికపాటి, యూట్యూబర్ అన్వేష్ వివాదంలో ప్రముఖ హేతువాది బాబు గోగినేని అన్వేష్కు మద్దతు తెలిపారు. గతంలో గరికపాటి మహిళలపై చేసిన వ్యాఖ్యలను అన్వేష్ ఖండించడాన్ని ఆయన సమర్థించారు. 50 ఏళ్లు దాటినా ఆగలేకపోతున్నానంటూ గరికపాటి అనుచిత భాషను ఉపయోగించారని గోగినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అన్వేష్ కూడా తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.