BDK: సామాజిక సంస్కర్త సావిత్రీబాయి ఫూలే 195వ జయంతిని తెలంగాణ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాల్వంచలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బహుజనులకు, మహిళలకు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి పాఠశాలలు స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె సేవలను కొనియాడారు.