VZM: పదో తరగతిలో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈవో పి.బాల భాస్కరరావు కోరారు. శనివారం ఆయన బక్కు నాయుడుపేట కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి, 100 డేస్ యాక్షన్ ప్లాన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.