NGKL: కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో శనివారం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ అశోక్ రెడ్డి, సర్పంచ్ పరశురాములు లబ్ధిదారులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.