TG: 2022 వరకు పాలమూరు రంగారెడ్డికి DPR కూడా తయారు చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసినట్లు KCR చెబుతున్నారని ఆరోపించారు. కానీ 33 శాతానికి మించి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదన్నారు. DPR ఇచ్చేలోపే 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డికి BRS ఎలాంటి అనుమతులు తీసుకురాలేదని పేర్కొన్నారు.