ప్రకాశం: కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో తొలి రోజు జరిగిన గ్రీవెన్స్‌లో 48 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి వినతిపత్రాలను ఎస్పీ స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.