MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో వింత రూల్ నడుస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవార్ల గద్దెలపై సమర్పించే బెల్లం, ఆభరణాలను టెండర్లు లేకుండా నేరుగా తరలించి విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. భక్తులకు పంచకుండా పూజారులు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ వత్తాసు పలుకుతుందని సమాచారం. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.