BHNG: బైక్ను టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన భువనగిరి మండలం హనుమాపురం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామానికి చెందిన వంగరి శేషు టూవీలర్ వాహనంపై రుస్తాపూర్కు వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి కాలు, చేయి విరిగింది. వెంటనే చికిత్స కోసం ఏరియా హాస్పిటల్కు తరలించారు.