NGKL: శిరసనగండ్లలోని సర్వే నంబరు 182లో సాగుతున్న నల్లరాయి తరలింపును వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. 3 రోజులుగా కాంట్రాక్టర్లు తిరిగి తవ్వకాలు ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంగళవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్లకు రైతులు అల్టిమేటం జారీ చేశారు.