కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరవుతారని భావించినా అనివార్య కారణాలతో రాలేకపోయినట్టు సమాచారం. దాంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.