రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి కావాల్సిన రోడ్డు మార్గ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్, కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు, అధికారులు పరిశీలించారు.