AP: కోనసీమ మలికిపురంలో ONGC గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందలాది కొబ్బరి చెట్లు తగలబడుతున్నాయి. ఘటనా స్థలానికి ONGC సిబ్బంది, అధికారులు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామస్తులు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్‌లకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఆరా తీశారు.