MNCL: బ్యాంకులతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సురేష్ అన్నారు. సోమవారం దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో దండేపల్లి అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు, ఖాతాదారులకు బ్యాంకు సేవలకు అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు, రైతులకు వివిధ రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పొదుపును అలవాటుగా చేసుకోవాలన్నారు.