SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వేములవాడలో పర్యాటకాభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వివరించారు.