టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అసోషియేషన్లో పారదర్శకత లోపించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సంస్థ నడుస్తున్న విధానాలతో తాను ఇకపై ఏకీభవించలేనని చెప్పాడు. కాగా, ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ను 2019లో వాసెక్ పోస్పిసిల్, జకోవిచ్ కలిసి స్థాపించారు.