NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగినాయి. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే తొలి బహుజన మహిళా ఉపాధ్యాయురాలుగా బహుజనులను చేర దీసి విద్య నేర్పిన మహనీయురాలని కొనియాడారు.