కోనసీమ: చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ వీరి అప్పారావు, ఈవో వీర్రాజు చౌదరి ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.