NZB: మెండోరా మండలం సావెల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీ రాజ్ ఎఈ రాజు పర్యవేక్షించారు. నిర్మాణం చేసిన రోడ్లను కొలతలు చేసి సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు చేపడుతున్నారా లేదా అని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత కలిగిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.