KMM: తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో కోడి పందాల స్థావరాలపై ఇవాళ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను ఐదు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.