PPM: రైతులకు భూమి ఉంటే ఖచ్చితంగా పట్టా ఉంటే ఆ భూమికి యాజమాని అవుతాడని కురుపాం ఎమ్మెల్యే తోయాక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం కురుపాం మండలం డి. బారమణీ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకోవాలని హితవు పలికారు.