AP: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణమని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఓ వ్యక్తి మద్యం సేవించి ఏకంగా టీటీడీ అనుబంధ దేవాలయంలోని రాజగోపురంపైకి ఎక్కడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అందులోనూ సదరు వ్యక్తి తనకు మద్యం కావాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. మద్యం తాగిన వ్యక్తి అక్కడ వరకు చేరుకున్నాడంటే భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.