GNRT: పొన్నూరులో శుక్రవారం సాయంత్రం గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వల్లో తేడాలు గుర్తించడంతో రేషన్ డీలర్‌పై 6A కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీ మాధవి తదితర సిబ్బంది పాల్గొన్నారు.