SRPT: బీసీ, ఎంబీసీ నిరుద్యోగ యువతకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి టీ.నర్సిములు ఇవాళ తెలిపారు. 18-40 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి పాసైన వారు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి, స్టైఫండ్ కల్పిస్తామని, ఆసక్తి గల వారు ఐడీవోసీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.