ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు టాయిలెట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒక్కో టాయిలెట్ల రూ.52 వేలు ఖర్చుతో కేంద్రం 70 శాతం రూ. 36,400, రాష్ట్రం 30 శాతం రూ. 15,600 నిధులు భరిస్తుంది. జిల్లాలో 5,123 కేంద్రాలకు రూ. 26.63 కోట్లు కేటాయించనున్నారు. ఈ చర్యతో చిన్నారుల సౌకర్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.