విశాఖ: ఆనందపురం మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు నుంచి విశేష స్పందన వచ్చింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సుమారు 40 మంది ఫిర్యాదుదారుల నుంచీ ఇళ్ల స్థలాలు, రహదారి విస్తరణ, ఆలయాల అభివృధి, మౌలిక వసతులకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.