AP: ఖరీఫ్ ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమ చేస్తుందన్నారు. CM చంద్రబాబు ప్రకటించిన రూ.128.33 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. కర్నూలు జిల్లా కోడుమేరులో అచ్చెన్న పర్యటించి మాట్లాడారు.