MBNR: సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 3న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యటన సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.