CTR: కన్న కూతురిపై తండ్రే అత్యాచారం చేసిన దారుణం పెద్దపంజాణిలో చోటుచేసుకుంది. పలమనేరు(R) CI పరశురాముడు కథనం మేరకు.. ST కాలనీకి చెందిన పెద్దబ్బ మొదటి భార్య కుమార్తె చికెన్ తీసుకుని వెళ్తుండగా ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు. అడ్డుకొన్న నానమ్మపై దాడి చేశాడు. బంధువులను పిలుచుకుని రాగా అప్పటికే అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.