JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో వసతి గదులు, దీక్షా విరమణ మండపం నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనుండగా, అధికారులు సిద్ధం చేశారు. ఇక పవన్ రాక కోసం ఇటు అధికారులు, మరో వైపు అభిమానులు ఎదురు చూస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.