TG: అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. సీఎంను విమర్శిస్తే.. మైక్ ఇవ్వనని స్పీకర్ అంటున్నారని మండిపడ్డారు. తాము ప్రభుత్వానికి భజన చేయాలా? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.