KMR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రవేశపెట్టిన పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ.రమణా రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఇద్దరు పిల్లల పరిమితిని సవరించి పెంచడం సరికాదన్నారు. రాజకీయ వెసులుబాటుకు మాత్రమే చట్ట సవరణ చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.