MBNR: అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామంలో పెద్ద చెరువు అలుగు, తూములను నీటి పారుదల శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. చెరువు కట్ట లోపల దెబ్బతిన్న రాతి గోడను, కాలువలను తనిఖీ చేసి మరమ్మతులకు కొలతలు తీసుకున్నారు. అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.