ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో, భారత జట్టును నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఈ జట్టులోకి శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రిషభ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.