BHPL: ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ హెచ్చరించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీమ్ లైట్లు మాత్రమే వాడాలని, ముందు వాహనానికి సురక్షిత దూరం ఉంచాలని, కిటికీలు కొద్దిగా తగ్గించి నడపాలని ఆయన ఆదేశించారు.