తిరుమల శ్రీవారిని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నాడు. నిర్మాత సాహు గారపాటి తదితరులతో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ నెల 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ విడుదల కాబోతుందని చెప్పాడు. తిరుపతిలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు.