WGL: నర్సంపేట మండల కేంద్రంలోని లక్నపల్లి, వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో బోల్తా పడిందని వారు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.