NZB: వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ నిన్న గుండెపోటుతో మృతి చెందాడు. బతుకు తెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దిరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది.