AP: అనకాపల్లి SVS కెమికల్స్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెంట్రిఫ్యూజ్ వద్ద మంటలు చెలరేగినట్లు గుర్తించారు. టోలున్ అనే రసాయనంతో మంటలు తీవ్రంగా వ్యాపించినట్లు తెలిపారు. ప్రమాద కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.