కర్నూలు: ఎమ్మిగనూరులో వైభవోపేతంగా నిర్వహించే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరను పట్టణ ప్రతిష్ఠను పెంపొందించేలా శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ ఎన్.భార్గవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ వి.శ్రీనివాసులు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె శనివారం మాట్లాడారు. జాతర సందర్భంగా శాంతి భద్రతలకు ప్రజలు సహకరించాలని DSP కోరారు.