అన్నమయ్య: నందలూరు మండలం అరవపల్లె క్రీడా మైదానంలో శనివారం బాలికలకు నిర్వహించిన కబడ్డీ పోటీలు రసవతంగా సాగాయి. పోటీలను లైన్స్ క్లబ్ ఛైర్మన్ కుర్రా మణి యాదవ్ ప్రారంభించారు. ఇందులో నాగిరెడ్డిపల్లె ZP పాఠశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ అధ్యక్షులు సామ్రాట్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.