కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలురు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.