SRPT: గరిడేపల్లి (M) కల్మలచెరువు సర్పంచ్ బచ్చలకూరి శ్రీను ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న గ్రామంలో(హైమాస్ట్ లైట్) సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, ప్రారంభించారు. కాగా ఇటీవల గ్రామంలోని అన్ని వీధుల్లో కలిపి కొత్తగా 400 విద్యుత్ బల్బులు సైతం ఏర్పాటు చేసి తాను ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ.. ప్రశంసలు పొందుతున్నారు.