KDP: జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డ్రోన్ సాయంతో నేరాల అడ్డుకట్టకు పోలీసులు చర్యలు చేపట్టారు. సోమవారం కడప సాయిపేటలోని వాటర్ ట్యాంక్ వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, ఆరు బీర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు.