KNR: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కోరారు. నిన్న మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఒక డివిజన్ ఓటర్లు మరో డివిజన్‌లోకి మారారని, దొంగ ఓట్లను తొలగించి జాబితాను సరిచేయాలని విన్నవించారు. అర్హులైన యువతకు కొత్త ఓటర్లుగా నమోదయ్యే అవకాశం కల్పించాలని కోరారు.