సిద్దిపేట: చేర్యాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయితీ ఆకునూరులో నిన్న జరిగిన భారత్ ఆటో యూనియన్ సంఘం నిర్వహించిన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడుగా పాల సాయిరెడ్డి, ఉపాధ్యక్షుడుగా మల్లమారి నవీన్ కుమార్, కోశాధికారిగా ఏళ్ల రజనీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను తీర్చాలని కోరారు.