TG: మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పేలా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. పతంగుల పండుగలో 19 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఇందులో స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.