టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసీస్ మాజీ ప్లేయర్ మార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి తరంలో జైస్వాల్ టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు. అతడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. అయితే, మార్క్ అభిప్రాయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఏకీభవించలేదు. భవిష్యత్తులో హ్యారీ బ్రూక్ హవా కొనసాగుతుందని మైఖేల్ అంచనా వేశాడు.